Tuesday, 22 November 2016

బొగ్గు లారీ ల రవాణాను అడ్డుకున్న రైల్వే అధికారులు

 బొగ్గు లారీ ల రవాణాను అడ్డుకున్న రైల్వే అధికారులు 
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి)  సింగరేణి బొగ్గును రెబ్బెన యార్డ్ కు తరలిస్తున్న  బొగ్గు లారీలకు అనుమతి లేదని రైల్వే అధికారులు మంగళవారం నాడు సి హెచ్ పి వద్ద ఉన్నటువంటి రైల్వే  అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దారిని మూసివేయడం జరిగింది.గతం లో  ఈ మార్గం ద్వారానే రవాణా కొనసాగిస్తుండగ రైల్వే నూతన అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి ప్రయాణించే అనుమతి లారీ లకు లేదని బండరాళ్లు,ఇనుప రైలు పట్టాలతో దారిని మూసివేశారు. దీనితో లారీ లు రెబ్బెన సమీపం లో నంబాల వెళ్లే దారి లో ఉన్నటువంటి రైల్వే గేట్ నుండి వెళ్తున్నాయి,దీని వల్ల రోడ్ కు ఇరువైపులా లారీ ఆగడం తో ఆ మార్గం వెళ్లే వివిధ గ్రామాల ప్రజలు ఇబ్బంధులపడుతున్నామని అన్నారు.

No comments:

Post a Comment