డిజిటల్ తరగతులు ప్రారంభం
కొమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బోధన సరళతరం చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థుల కోసం రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) వారు అవసరమైనా సాంకేతిక పరికరాలను పంపిణీ చేశారు. రెబ్బెన లోని జిల్లా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు బుధవారం జడ్ పి టి సి ఏ .బాబురావు ఎం పి పి సంజీవ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై డిజిటల్ తరగతులను ప్రారంభించారు విద్యాధికారి వెనకటేశ్వర స్వామి మాట్లాడుతూ 6 నుంచి 10వ తరగతి వర కు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ తరగతులనుప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు, మధ్యాహ్నం 2-4 గంటల మధ్య తరగతులు ప్రసారమవుతాయని తెలిపారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్త మ ఫలితాలు సాధించేలా ఈ తరగతులను ప్రారంభించారని ఆధునిక యుగం లో విద్యను డిజిటల్ గ అందించడం విద్యార్థుల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అన్నారు కార్యక్రమంలో ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ ,ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధరకుమార్ , ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, శంకర్ సురేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment