గెస్ట్ హౌస్ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి : పూదరి సాయి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నాణ్యత పాటించకుండా నాసిరకంగా భోజనం పెడుతున్న గోలేటి సింగరేణి అతిధి గృహం కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగ గోలేటి లోని సిపిఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతు నాణ్యాత పాటించకుండా నాసిరకంగ బొజనం పెడుతు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.రెండు రోజుల క్రితం కూరలు కూడా ఫ్రీజ్ లో పెడుతు మల్లి వాటినే భోజనాల్లో వడ్డిస్తున్నారని అన్నారు. అతిధి గృహనికి వెళ్లిన వారి పట్ల అమర్యాదగా వ్యవహరిస్తూ దుర్భాషలాడుతున్నారని అన్నారు.సింగరేణి అధికారులతో పాటు సంస్థలో పరోక్షంగా విధులు నిర్వహిస్తున్న వారికి కూడా భోజనం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ వారు మాత్రం నియమనిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉచితంగా ఏమి అందించడం లేదు కదా డబ్బులు తీసుకోని భోజనం అందించడం లో వారికి వచ్చిన సమస్య ఏంటి అని ప్రశ్నించారు. భోజన విషయం లో కూడా నాణ్యత పాటించడం లేనందున సింగరేణి అధికారులు పరిశీలించి వారి పట్ల చర్యలు తీసుకోవాలని,అదే విధంగా సంబంధిత కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment