Wednesday, 16 November 2016

ముదిరాజ్ ల మహా యాత్ర పోస్టర్ల విడుదల

ముదిరాజ్ ల మహా యాత్ర పోస్టర్ల విడుదల
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో  ముదిరాజ్  యూత్ మహా  పాద యాత్ర  హలో  ముదిరాజ్ చలో హైదరాబాద్ పోస్టర్లను విడుదల చేశారు . ఈ సందర్బంగా జిల్లా నాయకులు ముదిరాజ్ సంఘం  జిల్లా అధ్యక్షుడు   పెసరు మధునయ్య  ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ లను బి సి  డి  నుండి బి సి  ఏ కులమునకు మార్చాలని అన్నారు .బి సి ఏ లో కలపడం వాళ్ళ  యువతకు ఉపాధి కల్గుతుందని ,యువతకు రుణ సదుపాయం,కల్పించాలని  అన్నారు ఈ మహా పాద యాత్ర డిసెంబర్ 2 నుండి 18 వరకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు కొనసాగుతుందని అన్నారు  జిల్లా యువజన ఆధ్వర్యములో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు తేలిపారు. .  హైద్రాబాద్ లోఇందిరాపార్క్ లో  నిర్వహించే  బారి బహిరంగ మహా సభకు ముదిరాజ్ కులస్తులందరు  అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో ముదిరాజ్ సంఘం నాయకులు ముల్కల్లపల్లి వెంకటేశ్వర్లు , అంకం పాపయ్య ,మూడెడ్ల  శ్రీనివాస్ ముదిరాజ్  తోట లక్మన్  , అంకం స్వామి ముదిరాజ్ , పేట మల్లయ్య ,  రమేష్ ,  సందీప్, పోతిరెడ్డి  రమేష్  ,ఎర్రం మల్లేష్   లు ఉన్నారు.  

No comments:

Post a Comment