రెబ్బెన ; రెబ్బెన మండలంలోని వట్టివాగు ప్రాజెక్య్త నుండి వరిపంటకు నీరు విడుదల చేయాలని శనివారం రైతులు రెబ్బెన మండల తహసీల్దార్ సాయన్నకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వట్టివాగు ప్రాజెక్ట్ నీటిని నమ్ముకొని మండలంలోని నక్కలగూడ, పుంజుమ్మెరా గూడా, ఇందిరా నగర్, రెబ్బెన, సింగల్ గూడ, గ్రామాలలోని రైతులు సుమారు 350 ఎకరాలు సాగు చేస్తున్నారని గత 20 రోజులుగా డిస్ట్రిబ్యూషన్ 9 నుండి 12 వరకు గల పంటపొలాలకు నీటిని విడుదల చేయడం లేదని, సంభందిత అధికారులకు ఎన్నిసారు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని , కావున వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వనమాల మురళి, సుదర్శన్ గౌడ్ రావుజీ. వాడై శివరాం,సురేష్, ఓ సురేష్, తిరుపతి, భీంరావు, రాజు, మురళి గోపీచంద్, శంకర్, బాలాజీ, అజ్మీరా రమేష్, వెంకటేశ్వర గౌడ్, ఎల్ రమేష్, కొత్రాంగిహన్మంతు, తదితర వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment