కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 26 ; గ్రామ పంచాయతీ ఉద్యోగులు గతంలో సమ్మె చేసినప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తన్న నేటి వరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బోగే ఉపేందర్ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో గురువారం తహశీల్ధార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 4 వ రోజు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భోగే ఉపేందర్ మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. .జి ఓ నెం 112, 212 లను సవరించి అందరిని పెర్మనెంట్ చేయాలని అన్నారు.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చెసారు. అరుహులైన వారందరిని కార్యదర్శి గా నియమించాలని అన్నారు. సమ్మె చేస్తున్నపంచాయతీ ఉద్యోగులకు కాంగ్రెస్ నాయకులూ మాజీ జడ్పీటీసీ పల్లె ప్రకాశ రావు, దుర్గం రాజేష్, లింగయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్,రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుకడ్తాల మల్లయ్య,మండల అధ్యక్షుడు రామడుగుల శంకర్, నాయినిబ్రహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెయ్యిలగాండ్ల కృష్ణ,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ లు మద్దతు ప్రకటించారు. ఈ దీక్షలో కూర్చున్నవారు.ఏఐటీయూసీ జి పి డబ్ల్యూ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్, కార్మికులు దేవాజి, వీరయ్య, నారాయణ,లక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
Anna good job
ReplyDelete