Tuesday, 10 July 2018

కల్యాణ లక్ష్మి పథకం లో గెజిటెడ్ సంతకం కోసం ఇబ్బందులు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 10 ; రెబ్బెన: కల్యాణ లక్ష్మి పథకం లోని దరకాస్తులో  పొందుపర్చిన గెజిటెడ్ సంతకంతో సామాన్యులకు మరియు రైతు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దుర్గం రాజేష్ మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.లబ్ధిదారులు గెజిటెడ్ సంతకం కోసం ఏ అధికారి వద్దకు వెళ్లాలో తెలియక ప్రతి అధికారి చుట్టు తిరిగి అధికారులు సరైన స్పందన ఇవ్వకుండా చులకనగా చూస్తుండటం తో  కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు.సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని కల్యాణ లక్ష్మి దరఖాస్తులో గెజిటెడ్ సంతకం స్తానం తొలగించడం లేదా ఒక నిర్దిష్టమైన అధికారి సంతకం పెట్టించాల్సింగా పొందుపర్చాలని కోరారు.

No comments:

Post a Comment