కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 15 ; జాతీయ మానవహక్కుల పరిరక్షణ సమితి కొమురంభీం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రంగు మహేష్ గౌడ్ ని నియమించినట్లు మానవహక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఆర్కె జైన్ మరియు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సహారే బాను ఆదివారం హైదరాబాద్ లో జరిగిన స్టేట్ లెవల్ ప్రోగ్రాంలో తెలిపారు.అనంతరం నూతనంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ మాట్లాడుతు నాపై నమ్మకం ఉంచి ఈ భాద్యతను అప్పగించినందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని , జిల్లా లో మానవహక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతామని అన్నారు.ఈ సందర్బంగా మానవహక్కుల పరిరక్షణ సమితి కమిటి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment