కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 06 ; రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్ లో శుక్రవారం బాబు జగ్జీవన్ రాం 32వ వర్దంతి ని ఘనంగా నిర్వహించరు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్, ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులు బి గోపాలకృష్ణలు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రాం మహోన్నత నాయకత్వం, వ్యక్తిత్వం, సేమ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు, సంస్థకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయన్నారు. భారత రిపబ్లిక్ తొలి లోక్‌సభ (1952)లో ప్రవేశించిన జగ్జీవన్‌రామ్ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచారని, . ముప్ఫైమూడు సంవత్సరాు పాటు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా వివిధ పదవులు అలంకరించారన్నారు. దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించి . మొదటి శ్రేణి పార్లమెంటే రియన్‌గా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో బి భద్రు నాయక్, జాదవ్ సంజేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు లింగంపల్లి ప్రభాకర్, బిజెపి దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోరల రాజేందర్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మల్ రాజ్ రాంబాబు, ఉపాధ్యక్షులు పస్తాం పోస్తం, చిలుముల శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment