కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 04 ; విద్య రంగ ప్రైవైటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకం గ నేడు విద్య సంస్థల బంద్ లో స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలనీ ఏ ఐ ఎస్ ఎఫ్ రెబ్బెన డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలొ మౌలిక వసతులు మెరుగు పరచాలని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు, వసతి గృహాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలని ,ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలనీ అంన్నారు. ఈ సమావేశంలో డివిజన్ ఉపాధ్యక్షులు పర్వతి సాయికుమార్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పూదరి అరుణ్ సాయి,నాయకులూ సంజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment