Saturday, 14 July 2018

యాపిల్‌తో నూరేళ్ల ఆయుష్షు

యాపిల్ అందరూ తినాల్సిన పండు.  యాపిల్ తోటల పెంపకం గురించి తెలిపే శాస్త్రాన్ని పామాలజీ అంటారు పూర్వం చాలా ప్రాంతాల్లో యాపిల్‌ని ‘వింటర్ బనానా’ అని పిలిచేవారు. విదేశాల్లో జరిగే హాలోవీన్ వేడుకల్లో ‘బాబింగ్ ఫర్ యాపిల్స్’ ముఖ్యమైనది. చేతుల్ని ఉపయోగించకుండా కేవలం నోటితో యాపిల్‌నితీసే ఈ పోటీలో గెలిచిన వారికి అతి త్వరలో పెళ్లవుతుందని నమ్మకమట. ప్రపంచంలో మొత్తం 8000 రకాల యాపిల్స్ ఉన్నాయి. ఇవి ఎక్కువగా తిన్నా  చెడు గుణాలేమీ కనిపించవు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇష్టంగా తినే పండు.

అంత తియ్యగానూ ఉండదు.  చప్పగానూ ఉండదు. రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్‌తో పని లేనట్లే…! మనలో ఎంత మంది ఆపిల్‌ను ప్రతి రోజూ తింటారు? ఇందులోని ఉపయోగాలు తెలిస్తే ఎవ్వరూ కాదనలేరు.  ప్రపంచంలో అత్యధికంగా పండించే పంట, ఎక్కువగా తినగలిగే హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫ్రూట్. ఒక విధంగా చెప్పాలంటే ఇందులోని అద్భుతమైన ప్రయోజనాలను బట్టి ఇది ఒక అద్భుతమైన పండు అని చెప్పవచ్చు. ఎందుకంటే యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, వ్యాధులను వ్యతిరేకించే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా యాపిల్స్ లో పెక్టిన్ వంటి ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇది ఇక హెల్తీ చాయిస్ ఫుడ్. యాపిల్స్ ఉండే ఫైటో న్యూట్రీషియన్స్, యాంటా ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రిస్క్ ను , హైపర్ టెన్షన్, డయాబెటిస్, హార్ట్ సమస్యలను నివారిస్తుంది.  ఆపిల్ పండ్ల రసంలో యాలకులు, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే కడుపులో మంట, పేగుల్లోని పూత, అజీర్తీ, కడుపు ఉబ్బరం, తేన్పులు, ఛాతీలో మంట తగ్గుతాయి. రోజుకు మూడు ఆపిల్ పండ్లు తింటూ ఉంటే రక్తక్షీణత, శక్తిహీనతల సమస్య తొలగిపోతుంది. ఆపిల్ పండ్లు ఏ ఆయాసమూ కలగకుండా మలబద్దకాన్ని నివారిస్తాయి. ఎంత మంచి ఆహారం తిన్నా, రోజురోజుకూ బలహీన పడుతున్న వాళ్లు, ఉదయం, సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున ఆపిల్ తింటే శరీరం బలంగా తయారవుతుంది.
రక్త-జిగురు విరేచనాలు అవుతున్నప్పుడు ఆపిల్ జూస్ తీసుకుంటే చాలా త్వరితంగా విరేచనాలు తగ్గుతాయి. పసి పిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు కాస్తంత జ్యూస్ పట్టిస్తే ఆగిపోతాయి. రోజుకు పావుకిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక ఆపిల్‌లో ఒక మిల్లీ గ్రాము ఇనుము, 14గ్రాముల ఫాస్పరస్, 10 మి. గ్రాముల క్యాల్షియంతో పాటు ‘ఎ’ విటమిన్ ఉంటుంది. ఆపిల్‌ను తినడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది దంతక్షయాన్ని నివారించడంతో పాటు నోట్లో బ్యాక్టీరియా లెవల్స్ ను తగ్గిస్తుంది.
ప్రతి రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల మతిమరుపు నివారిస్తుంది. తాజాగా జరిపిన పరిశోధన ప్రకారం రెగ్యులర్‌గా ఆపిల్‌జ్యూస్ తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలనైనా నివారిస్తుందని వెల్లడి చేశారు. ఆపిల్ తొక్కలో ఉండే ట్రైటర్ఫినాయిడ్ కాంపౌడ్స్ లివర్, కోలన్, బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. కాలేయం టాక్సిన్స్ ను తొలగించడానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి, రెగ్యులర్ గా ఆపిల్స్ తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టివేయవచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.

No comments:

Post a Comment