తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ; ఎస్ తిరుపతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ; తెరాస ప్రభుత్వం ఎన్నికలలో చేసిన వాగ్దానాల ప్రజలకు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ తిరుపతి అన్నారు. సీపిఐ పార్టీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించతల పెట్టిన ధర్నా కార్యక్రమాలలో భాగంగా మంగళవారం రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతు అర్హులైన నిరుపేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు,దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి హామీలను తుంగలో తొక్కారనున్నారు.ఇప్పడికైనా వాటిని అమలు చేయాలన్నారు.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి రెబ్బెన మండలంలో 20 వేల ఎకరాల భూమికి సాగునీరందించే విదంగా చర్యలు చేపట్టాలని అన్నారు.కేజీ టు పిజి విద్యను అందిస్తామన్నారు,వెంటనే అమలు చేసి విద్యను అందించాలన్నారు.ఇంటికో ఉద్యోగం కల్పిస్తామన్నారు. వాటి అమలును మరిచారు అన్నారు.అదేవిదంగా గోలేటి గ్రామంలో రమణారెడ్డి కాలనీ వాసులకు ఇండ్ల కల్పించాలని ఈ సందర్బంగా కోరారు.వాటితోపాటు తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల తదితర అంశాలను వెంటనే అమలుపర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాడి గణేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు,రాయిల్ల నర్సయ్య సిపిఐ మండల కార్యదర్శి,బోగె ఉపేందర్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి,బి జగ్గయ్య,దుర్గం రవీందర్,రామడుగుల శెంకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment