కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; సింగరేణి యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు నిరసనగా ఆగష్టు 2 న సింగరేణి వ్యాప్తంగా అన్ని ఘనులు డిపార్టుమెంట్ల వద్ద ఎఐటియుసి మరియు సింగరేణి కాలరీస్ వర్కస్ యూనియలనులు సంయుక్తన్గా ధర్నా నిర్వహించనున్నట్లు ఎస్ తిరుపతి మంగళవారం తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతు గుర్తింపు సంఘం ఐన టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందున రోజు రోజుకు రాజకీయ జోక్యం స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరియు ఎంపీ ల జోక్యం ఎక్కువవుతున్నదని అన్నారు.పదవ వెజ్ బోర్డు 60 శాతం ఎరియర్స్ వెంటనే చెల్లించాలని,మెడికల్ బోర్డుకు అప్లై చేసిన ప్రతి కార్మికుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బయ్య మొగిలి,ఆర్గనైజింగ్ సెక్రెటరీ జెగ్గయ్య, శేష శేయణరావు,ఎం చంద్ర శేఖర్ ఫిట్ కార్యదర్శి జూపాక రాజేష్,జి నర్సింహ రావు,నాయకులు కోట శెంకరయ్య సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment