Sunday, 15 July 2018

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమన వేతనం కల్పించాలి.


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 15 ; సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమాన పనికి సమన వేతనం కల్పించాలని ఆదివారం రెబ్బెన మండలం లోని గోలేటి లో ఐఎఫ్ టియు  జాతీయ నాయకుడు టి శ్రీనివాస్ పోరుజాతా  ను జెండా ఉపి ప్రారంభించారు. ఓపెన్ కాస్టు కైరుగూడలో పర్యటించి అనంతరం వారు మాట్లాడుతు  గోలేటి లో మొదలైన పోరు జాతా ను   ఈ నెల 31వ తేదీ  మణుగూరు వరకు నిర్వహిస్తున్నట్టు అయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడి తెరాస ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచినా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని అన్నారు.   ఎన్నికల్లో గెలిపిస్తే కాంట్రాక్టు కార్మికులను  పర్మనెంట్ చేస్తామని.గెలిచిన తరువాత కాంట్రాక్టు కార్మికులకు  కెసిఆర్  తీరని అన్యాయం చేసి  అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు గత రెండువేల పదహారు అక్టోబర్ నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం కూడా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఈ సందర్భంగా చట్టాలు హక్కులు కోర్టు తీర్పులు అమలు చేయకుండా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారని అందుకే సింగరేణిలో పదకొండు డివిజన్లలో  ఐఎఫ్ టియు  పోరు జాతా  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కార్మికవర్గాన్ని పోరాటానికి సన్నద్ధం చేస్తున్నామని కార్మిక వర్గంలో పోరు జాతి కదిలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టియు  రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకన్న,బి సీతారామయ్య, ఉపాధ్యక్షులు డి బ్రహ్మానందం, రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్, బి తిరుపతి, మైసూర్ సింగ్, అంకుర్ రాజేష్, పోశం, బాపు, పాపారావు, తిరుపతి,  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment