Saturday, 14 July 2018

సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయుర్వేద శిబిరం


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 14 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి లోసింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో   హైదరాబాద్ కు చెందిన మాతా రీసెర్చ్ సెంటర్ కు చెందిన విశ్వనాథ మహర్షి సహకారంతో ఈ  నెల   16 న ఆయుర్వేద శిబిరం నిర్వహించబడునని డీజీఎం  పెర్సొన్నల్  జె   కిరణ్   ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10 నుండి సాయంత్రం  5 గంటల వరకు  నిర్వహిస్తారని,మానవ శారీరంలో పిత్తం,వాతం , శ్లేషం   అనేవి ముఖ్యమని వాటిని నియంత్రణలో ఉంచుకుంటే ఆరోగ్యమని , ఈ సదవకాశాన్ని కార్మికులు, సభ్యులు ఉపయోగించుకోవాలని అన్నారు. 

No comments:

Post a Comment