Monday, 30 July 2018

ఆగష్టు 9 న అవిశ్వాసం


రెబ్బెన మండల పరిషత్ ఎం పి  పి  కర్నాధం సంజీవ్ కుమార్ పై ఎంపీటీసీ లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై  ఆగష్టు 9 న సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఎంపీపీ గా కర్నాధం సంజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఐతే మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు జి రేణుక ( తెరాస ) కాంగ్రెస్, తెలుగు దేశం సభ్యుల మద్దతుతో  జులై 16 న అవిశ్వాస తీర్మానాన్ని ఆర్ డి ఓ కదం సురేష్ కు  ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో ఆగష్టు 9 న ఎంపీడీఓ కార్యాలయం లో అవిశ్వాసం పై చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. బలాబలాలు ఎంపీపీ కే సంజీవ్ కుమార్ (తెరాస) కు ప్రస్తుతం గంగాపూర్ ఎంపీటీసీ దుర్గం మల్లేశ్వరి (తెరాస) , గోలేటి ఎంపీటీసీ 3 వనజ (తెరాస) ల మద్దతు ప్రకటిస్తుండగా ,  అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఉపాధ్యక్షురాలు జి రేణుక (తెరాస) కు  కాంగ్రెస్ ఎంపీటీసీ   కే శ్రీనివాస్, ( నంబాల) తో పాటు నారాయణపూర్ ఎంపీటీసీ పల్లె అనిత (కాంగ్రెస్) ,గోలేటి 1 ఎంపీటీసీ మురళి బాయి (కాంగ్రెస్) ,వంకులం ఎంపీటీసీ వర్ష బాయి (టీడీపీ ), తక్కళ్ళపల్లి ఎంపీటీసీ మంగ (తెరాస), గోలేటి 2 ఎంపీటీసీ సురేందర్ రాజు (బీజేపీ) లు మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు రేణుక తో పాటు శ్రీనివాస్, సురేందర్ రాజు, మంగ లు క్యాంపు లో కొనసాగుతున్నారు. అనిత, మురళి బాయి , వర్షాబాయ్  లు స్థానికంగా ఉన్నప్పటికీ ఉపాధ్యక్షురాలుకు పూర్తి  మద్దతు ప్రకటిస్తున్నారు. దింతో అవిశ్వాసం నెగ్గడం ఖాయం అని పరిశీలకులు భావిస్తున్నారు. 





No comments:

Post a Comment