Tuesday, 10 July 2018

పేద ప్రజల అభివృద్ధియే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ; కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 10 ; వెనుకబడిన గ్రామాల ప్రజలను అభివృద్ధి పరచడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి మంగళవారం రెబ్బెన, నంబాల మరియు గోలేటిలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల పై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాలలోని వెనుకబడిన మరియు పేద కుటుంబాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏడు సంక్షేమ పథకాల ద్వార లబ్ది చేకూరుచేలా పలు సంక్షేమ పథకాలు విడుదల చేసిందని తెలిపారు.ప్రతి ఇంటికి చీకటి రాత్రులు తొలగించే దిశగా ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన పథకం ద్వారా  పల్లె, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి పేద మధ్యతరగతి ఇంటి వారందరికి  విద్యుత్తును అందించడంలో  భాగంగా  సౌభాగ్య యోజన పథకాన్ని ఆవిష్కరించి ఇప్పటి కీ విద్యుత్ అందని ఇంటికి  విద్యుత్తును అందించే ఉద్దేశం తో ఈ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు ఎటువంటి ఖర్చు లేకుండా కరెంటు మీటర్ పొందవచ్చని తెలిపారు.అలాగే ఎల్ఈడి విద్యుద్దీపాలు వినియోగిస్తే కరెంటు ఆదా చేయవచ్చని తెలిపారు.ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులు కేంద్ర ప్రభుత్వం తరుపున పంపిణి చేయనున్నట్టు తెలిపారు.అదేవిదంగా చెట్లను కాపాడి పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉన్నట్లు తెలిపారు.వంట చెరుకు కోసం చెట్లను కొట్టివేయకుండా గ్యాస్ లేని వారందరికి ప్రధాన మంత్రి ఉజ్వాల యోజన పథకం ద్వార దిగువగ ఉన్న ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ కేంద్ర ప్రభుత్యం అందజేస్తున్నట్టు తెలిపారు ఈ పథకాన్ని గ్యాస్ లేని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కారక్రమంలో జెసి అశోక్ కుమార్,డిపిఓ గంగాధర్,డిఎంఏచ్వో సుబ్బారాయుడు,ఎంపిడివో సత్యనారాయణ సింగ్,జెడ్పిటిసి అజ్మేర బాపురావు,తదితర  అధికారులు నాయకులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment