కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 28 ; రెబ్బెన మండల కేంద్రంలో తహశీల్ధార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు గత 6 రోజులుగా చేపట్టిన నిరవధిక సమ్మె చేస్తున్నకార్మికులను ఉద్దేశించి శనివారం మాజీ జడ్పీటీసీలు పల్లె ప్రకాశరావు, ,దుర్గం సోమయ్య సీపీఐ మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య లు మాట్లాడారు. సమ్మె నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె లో న్యాయమైన డిమాండ్ల ఉన్నాయని.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే డిమాండ్ల్ ను పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. సమ్మెకు లతో పాటు వివిధ పార్టీ నాయకులు,యువజన సంఘం నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు.వివిధ కులాల సంఘం నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సునార్కర్ మహేందర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, నాగవెళ్లి సుధాకర్ గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ మండల ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల రాజేష్, లాలూ సింగ్ కార్మికులు లక్ష్మి, దేవాజి,వీరయ్య,లతో పాటు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment