Thursday, 5 July 2018

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు ; ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్


  • మండలంలో 8 కోట్లతో అభివృద్ధి పనులు
  •  నెల రోజుల్లోనే వంకులం గ్ర్రామానికి రోడ్లు నీటి సమస్యలు పరిస్కారం
  • అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 05 ;  తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని,  అభివృద్ధిపై బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధమని రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్  అన్నారు. గురువారం రెబ్బెన ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలో సుమారు 8 కోట్లతో అభివృద్ధి పనులు చేసిన ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి  ను కేవలం ఎన్నికల నేపథ్యంలో విమర్శించడం తగదని హితవు పలికారు.  వంకులం గ్రామ ప్రజలు వారి ఊరు సమస్యల పై   ఎం ఎల్ ఏ కోవ లక్ష్మికి  వినతిపత్రాన్ని అందించిన నెల రోజుల్లోనే వారి గ్ర్రామానికి రోడ్లు నీటి సమస్యను నెరవేర్చడం జరిగిందన్నారు. నలభై ఏళ్ళు అధికారంలో ఉండి  కాంగ్రెస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలో ప్రజారంజక పాలనతో చేసి చూపిన తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కాంగ్రెస్ నాయకులూ ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి విషయం లో  చేసిన విమర్శల్లో కనీస వాస్తవాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ  విసెచైర్మన్ కుందారపు శంకరమ్మ, నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల, రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, తెరాస నాయకులూ బొర్కూట్  నాగయ్య, చెన్న  సోమశేఖర్,  గజ్జెల సత్యనారాయణ, నవీన్ జైస్వాల్, ఎం   సుదర్శన్ గౌడ్, ఎం  శ్రీనివాస్, ఎం  చిరంజీవి  గౌడ్, సంగం శ్రీనివాస్, రాజి రెడ్డి  వినోద్  జైస్వాల్, వెంకటేశ్వర గౌడ్,  అశోక్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment