కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 ; ప్రజాధనంతో ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలను అర్హులైన రైతులకు ఖచ్చితంగా అందజేసే బాధ్యత ప్రభుత్వానిదే అని జన సమితి జిల్లా ఇన్చార్జ్ బీ బాపన్న అన్నారు. శుక్రవారం రెబ్బెన లోని అతిథి గృహ ఆవరణలో రైతు దీక్షకు సంబంధించిన గోడప్రతులను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ భూ ప్రక్షాళనలో జరిగిన తప్పులను తక్షణమే సరిదిద్దాలని కోరుతూ తెలంగాణా జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఈ నెల 23 న కలెక్టరేట్ల ముందు చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. భూ ప్రక్షాళనకు సమందించిన ధరణి వెబ్ సైట్ ను యుద్ధప్రాతిపదికన బాగుచేసి పనిచేసేటట్లు చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఇంచార్జి రవీందర్,కన్వీనర్లు లావుడ్య ప్రేమ్ కుమార్, మనోహర్, రాజశేఖర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment