కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 14 ; సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నదని జీఎం రవిశంకర్ అన్నారు. శనివారం రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లో 48 లక్షల వ్యయంతో నూతన హాస్టల్ భవన నిర్మాణం కొరకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడారు. ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమేం కోసం యాజమాన్యం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. కార్మికుల సంతోషమే అభివృద్ధికి పునాది అని అన్నారు. ఇందులో భాగంగా సి వి ఆర్ క్లబ్, షటిల్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం సివిల్ ప్రసాద రావు, ఈ ఈ రాజేంద్ర ప్రసాద్ , వర్క్ సూపెర్ వైజర్ నవీన్, కాంట్రాక్టర్లు తిరుపతి, నర్సింహులు ఉన్నారు.
No comments:
Post a Comment