కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 19 ; తెలంగాణా రాష్ట్రంలోని యాదవుల అభ్యున్నతికి ప్రభుత్వం గొఱ్ఱెల పంపిణి కార్యక్రమం చేపట్టిందని రెబ్బెన జడ్పీటీసీ అజమీర బాపు రావు అన్నారు. మండల కేంద్రం ఎం పి డి ఓ కార్యాలయంలో 11 గొర్రెల మేకల సహకార సంఘాలకు రెండవ విడత గొర్రెల పంపిణి పై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. రెబ్బెన మండలంలో మొదటి విడత 201 మందికి గొర్రెలను పంపిణి చేసినట్లు, రెండవ విడతలో 199 మందికీ పంపిణి చేయను న్నట్లు తెలిపారు. గొర్రెల పధకం లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ సర్పంచ్ భీమేష్, పాక్స్ డైరెక్టర్ మధునయ్య, మండల యాదవ సంఘం అధ్యక్షులు చంద్రయ్య, ఆసిఫాబాద్ తాలూకా యాదవ సంఘం అధ్యక్షులు అరిగేలా మల్లికార్జున్, జిల్లా యాదవ ఫంఘం ఉపాధ్యక్షులు పి పర్వతాలు, 11 సంఘాలకు చెందిన అధ్యక్షులు, సభ్యులు, పశు సంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment