కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 03 ; రెబ్బెన మండలం దేవులగూడ గ్రామానికి అక్రమంగా నల్ల బెల్లం సరఫరా అవుతుందనే విశ్వసనీయమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్ *సి.ఐ. అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్, సునీతలు దేవులగూడ గ్రామ సమీపంలో నిఘావేసి నల్ల బెల్లం తరలిస్తున్న ఇద్దరు మహిళలు ముచ్చెర కొమురమ్మ,టేకుమట్ల ఎల్లమ్మ లను అదుపులోకితీసుకున్నారు. . వీరు కరీంనగర్ జిల్లా దుర్శేడ గ్రామానికి చెందిన వారని, కరీంనగర్ నుండి ప్రతిరోజూ పుష్పుల్ రైలు ద్వారా నల్ల బెల్లం తీసుకువచ్చి రెబ్బెన మండలంలోని గుడుంబా తయారీదారులకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.వీరివద్ద స్వాధీనం చేసుకున్న సుమారు 5000/- విలువచేసే ఒక క్వింటాలు నల్ల బెల్లం మరియు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం రెబ్బెన పోలీస్ లకు అప్పగించారు
No comments:
Post a Comment