కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 26 ; గోలేటి డోర్లి ఓసిపి 1 ఘనీ ఆవరణలో మొదటి రెండవ షిప్ట్ ప్రారంభంలో మల్టి డిపార్ట్మెంట్ కమిటీ సమావేశాలను ఏరియా జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్ ఆధ్వర్యంలో కార్మికులకు పవర్ ప్రజంటేషన్ ద్వార సింగరేణి సిఎండి శ్రీధర్ సందేశాన్ని అందించారు.అనంతరం జియం రవి శెంకర్ కంపెనీ స్థితిగతులు,నాణ్యత,ఉత్పత్తి,ఉత్పాదక బొగ్గు రవాణా,రక్షణ,సంక్షేమ కార్యక్రమాలు తదితర వివరాలను కార్మికులకు వివరించారు.బెల్లంపల్లి ఏరియా 2018-2019 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో నిలిచిందని అందుకు కృషి చేసిన కార్మికులకు సూపెర్వైజర్లకు అధికారుకులకు కార్మికులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్టి డిపార్ట్మెంట్ కమిటీ కన్వీనర్ ఎస్ ఓటు జియం వీరాస్వామి,ప్రాజెక్టు అధికారి మోహన్ రెడ్డి,రక్షణ అధికారి సాయిబాబు,ఏరియా ఇంజనీర్ సీతారామన్,డిజిఎం పర్సనల్ కిరణ్,టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment