కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ; అక్రమ గుట్కా, మద్యం అమ్ముతున్నారు అనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సి.ఐ. అల్లం రాంబాబు నేతృత్వంలో సోమవారం రెబ్బెన, నంబాల గ్రామంలో తనిఖీలు చేయగా నంబాల గ్రామంలోని జైస్వాల్ శ్రీను ఇంట్లో 2,000 /-విలువగల మద్యం మరియు రెబ్బెన మండల కేంద్రంలోని ఆత్మకూరు నరేష్ షాప్ లో 10,090/- విలువగల మద్యం, 2,958/- విలువగల గుట్కా స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం రెబ్బెన పోలీస్ వారికి అప్పగించరు. టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్, సునీతలు ఉన్నారు.
No comments:
Post a Comment