కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 27 ; గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టి ఆర్ ఎస్ కే వి జిల్లా కార్యదర్శి నగవేల్లి సుధాకర్ లు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల 5వ రోజు నిరవధిక సమ్మె శిబిరం వద్ద మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు .కార్మికుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అన్నారు. దీక్షలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,సహాయ కార్యదర్శి ఎల్లల పోచం,కోశాధికారికళావేన,తిరుపతి,కార్మికులుప్రకాష్,అన్నజీ,మల్లేష్,రాజలింగ్,వీరయ్య,దేవాజి,సంతోష్,ధర్మయ్య తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment