Sunday, 15 July 2018

కాంగ్రెస్ పార్టీ ని విమర్శించేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 15 ; తెరాస నాయకులూ కాంగ్రెస్ పార్టీ ని విమర్శించేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముంజం రవీందర్, నంబాల ఎంపీటీసీ కొవూరి  శ్రీనివాస్ లు   అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహములో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ని విమర్శించినా రెబ్బెన ఎంపీపీ కర్నాధం సం జీవ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం తో గెలిచి, పదవి కోసం తెరాస పార్టీలో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ని విమర్శించడం తల్లిపాలు త్రాగి  రొమ్మును గుద్దినట్లు ఉందన్నారు. ఎంపీపీ తన స్థాయిని తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీని  విమర్శించకూడదని  హితవు పలికారు.ఎంపీపీ  గత నాలుగేళ్లుగా తన సొంత  గ్రామమైన కొండపల్లికి కనీసం రోడ్ వేయలేదని అన్నారు.  అటువంటి వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడడం ఏమిటని ఎద్దేవా చేశారు. మండలంలో  గత నాలుగేళ్ళ తెరాస  పాలనలో ఎంతమందికి 3 ఎకరాల భూమిని పంచారో చెప్పాలన్నారు. మండలంలో ఎన్ని డబల్ బెదురూమ్ ఇళ్లకు ప్రారంభోత్సవం చేసారో తెలపాలన్నారు. మండలంలో ఏ  రోజు చుసిన కనీసం 100 మంది ఎం అర్  ఓ కార్యాలయం దగ్గర గుమిగూడి ఉంటున్నారని ప్రతిరోజూ రైతులు విద్యార్థులు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు   పడుతున్నారని అన్నారు. పాసిగం,వరదల గూడా,సింగల్ గూడా,ధర్మారం,పుంజుమేర గూడా,మద్వైగూడ తదితర గ్రామాల్లో బిటి రోడ్లు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందని అలాగే రెండు కరెంటు సబ్ స్టేషన్స్ కూడా కాంగ్రెస్ హయంలోనే  వేయించడం  జరిగిందని వివరించారు.భూమి లేని నిరుపేదలకు తుంగేడ,పసిగామ్ గ్రామాల్లో భూములు పంపిణి చేసి పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.ఇప్పుడు తెరాస ప్రభుత్వం అట్టి భూమి ఫారెస్ట్ రిజర్వ్ భూమి అంటు పేద ప్రజలకు ఇచ్చిన భూమిని లాక్కుంటుందని తెలిపారు.రెబ్బెన మండలం లో తెరాస ప్రభుత్వం తరుపున ఇప్పటి వరకు మండలంలో  వేసిన రోడ్లు సింగరేణి నిధుల నుండి మూడు గ్రామాల్లో మాత్రమే వేసి మండలం మొత్తం అభివృద్ధి చేశామనడం సిగ్గుచేటన్నారు.  అభివృద్ధి పై చర్చకు ఎప్పుడైనా  సిద్ధమని అన్నారు.   ఈ  కార్యక్రమంలో  పాక్స్ చైర్మన్ గాజుల రవిందే, ఉపాధ్యక్షులు వెంకటేశం చారి,దుర్గం రాజేష్, ప్రధాన కార్యదర్శి దుర్గం దేవాజి ,ఎస్ టి సెల్ నాయకులూ లావుడ్య రమేష్, వస్రం  నాయక్, వెంకన్న , ఎన్  ఎస్ యు ఐ  మండల అధ్యక్షులు పూదరి హరీష్, నాయకులూ ఆత్మారావు, ప్రేమదాస, బానయ్య, సంతోష్, జలపతి  , భీంరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment