Saturday, 28 July 2018

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ; దుర్గం రవీందర్



  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జులై 28 ; గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా ఇంచార్జ్ కొండగుర్ల చంద్రశేఖర్ అన్నారు.  రెబ్బెన మండలకేంద్రంలో  గత వారం రోజుల నుండి సమ్మె చేస్తున్నపంచాయతీ  కార్మికులకు ఏఐఎస్ఎఫ్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ విద్యార్థి సంఘాల పక్షాన మద్దతు తెలిపి  అనంతరం  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న గ్రామపంచాయతీ కార్మికులను టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని అన్నారు. గత వారం రోజుల నుండి పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టడంతో  గ్రామాలలో మౌలిక సదుపాయాలైన నీరు, పారిశుధ్య పనులు నిలిచిపోయాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.   రాష్ట్రప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా వ్యవహరిస్తూ పంచాయతీ కార్మికులను విస్మరిస్తోందని అన్నారు.  ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment