Tuesday, 3 July 2018

ప్రజా సమస్యల పరిష్కారానికి భాజపా ముందుంటుంది ; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం

.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 03 ;  ప్రజా సమస్యలపై పోరాటానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు వెన్నంటే ఉంటుందని. మోడీ ప్రభుత్వం ప్రజలకోసం అమలు చేస్తున్న ఎన్నో  సంక్షేమ  పథకాలను  ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా భాజపా నాయకులు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం అన్నారు.భారతీయ జనతాపార్టీ ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా మంగళవారం రెబ్బెన మండలం లోని గోలేటి లోని  భాజపా జిల్లా కార్యాలయానికి అయన విచ్చేసి అనంతరం వారు మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు లబ్ది చేసే విదంగా ప్రజలకు అవగహనా కల్పిస్తు భాజపా నాయకులకు పలు సూచనలు చేసారు.అదేవిదంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి  పథకాల గురించి అవగహన కల్పిస్తున్నామన్నారు.అనంతరం నాయకులు ఏర్పాటు చేసిన తేనేటి విందు  కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు జెపి పౌడెల్,భాజపా నాయకులు ఆంజనేయులు గౌడ్,చక్రపాణి,సతీష్ బాబు,బాలకృష్ణ,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment