Friday, 20 July 2018

విద్యార్ధి యువజన సంఘ పాదయాత్రను విజయవంతం చేయాలి.





కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 ;  ఆర్ అండ్ బి అధికారుల  నిర్లక్ష్యానికి నిరసనగా విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో 21వ తేదీన తక్కళ్లపల్లి గ్రామం నుండి వాంకిడి మండల గోయిగం వరకు చేపట్ట తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి శుక్రవారం అన్నారు.అంతరాష్ట్ర రహదారి,గ్రామీణ ప్రాంత రహదారులు గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రమాదాలు జరిగి ప్రాణాపాయం నష్టం జరుగుతున్నాయి తెలిపారు. గుంతలు ఏర్పడిన రోడ్లను మరమత్తులు చేయడంలో ఆర్అండ్ బి అధికారులు విఫలం అవుతున్నందున ఈ పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు.పాదయాత్రను ప్రారంభించడానికి పార్టి ప్రజాసంఘాలు,స్వతంత్ర సమరయోధులు హాజరవుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,చునార్కర్ మహేందర్,పి మహేష్,మొర్లే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment