Wednesday, 18 July 2018

రైతులను మోసం చేస్తున్నతెలంగాణ ప్రభుత్వం : టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 18 ;  రైతులకు ఉన్న భూములను లాక్కొని తెలంగాణా ప్రభుత్వం మోసం చేస్తున్నదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎం ఎల్ ఏ ఆత్రం సక్కు అన్నారు.  బుధవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణ విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతు.మండలం లోని రైతులకు  ముప్పై సంవత్సరాలుగా  కాస్తు చేస్తున్న  భూములకు గత కాంగ్రెస్ హయాంలో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వడం జరిగిందని వాటి ద్వార రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం బ్యాంకు ద్వారా లోన్ లు తీసుకోవడం జరిగిందని తెలిపారు.  పేద మధ్యతరగతి  బడుగు బలహీన వర్గాల రైతు ప్రజల   భూములకు పట్టాలు,రైతు బందు చెక్కులు ఇవ్వకుండా గత కొన్ని రోజులుగా రైతులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నది .  ఇప్పుడు అట్టి భూమిని తెరాస ప్రభుత్వం ఫారెస్ట్ రిజర్వ్ భూమి అని వాటిని లాక్కునే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు.ముప్పై సంవత్సరాల క్రితం లేని అటవి భూమి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చినదని ప్రశ్నించారు. నేడు తెరాస ప్రభుత్వ హయాంలో భూ సర్వ్ చేసి వారందరికీ వన్ బి ఫారం లు ఇచ్చి.గత రెండు నెలలుగా రైతులను తెరాస ప్రభుత్వంలో  చేరితే తప్ప వారికి చెక్కులు పట్టా పాసుబుక్కులు ఇవ్వమని వారిని భయబ్రాంతులకు గురిచేయడం అన్యాయమని తెలిపారు.తెలంగాణ రాష్టం కోసం ఎంతో పాటుపడిన బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎన్నో రకాలుగా మోసంచేస్తుందన్నారు.పేద మధ్యతరగతి ప్రజల నుండి సెంటు భూమి లాక్కునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ తరుపున ఉపేక్షించేదిలేదని అన్నారు.ప్రజల సౌకర్యార్థం జిల్లాలు,మండలాలు,గ్రామాలు ఏర్పాటు చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అధికారులు నాయకులు మండల రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా కేంద్రం లో ఉంచి వివిధ గ్రామాల మండల ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు కలుగజేస్తున్నారన్నారు.వెంటనే రెవెన్యూ కార్యాలయ సిబ్బంది మండల కేంద్రంలో ఉండే విదంగా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కె విశ్వ ప్రసాద్, ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాష్, మహిళా జిల్లా అధ్యక్షురాలు ఇరుకుల మంగ, మండలాధ్యక్షుడు ముంజం రవీందర్,  పిఎసిఎస్ ఛైర్మెన్ గాజుల రవి,వైస్ ఛైర్మెన్ వెంకటేశం చారి, ఉపాధ్యక్షుడు దుర్గం రాజేష్,ఎస్టీ సెల్ నాయకులు ఎల్ రమేష్,నాయకులు వస్రం నాయక్,వెంకన్న,దేవాజి,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment