కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 17 ; సమాజ సేవ లో అందరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ తమ వంతూ బాధ్యతగా సమాజ సేవ చేయడానికి ముందుకు రావాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందరపు శంకరమ్మ అన్నారు. మంగళవారం తెరాస మహిళా మండల అధ్యక్షురాలు ఎం పద్మ ఆధ్వర్యంలో మంగళవారం రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి లో బ్రెడ్ పంపిణి కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు. ప్రతి మంగళవారం ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు క్రమం తప్పకుండా ఏదో ఒక పౌష్టిక ఆహారం అందించడం అభినందనీయమన్నారు. మండలంలోని వివిధ గ్రామాలనుంచి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి తెరాస మండల ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ, ఎస్సై శివకుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, భోగే ఉపేందర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఆస్పత్రి సిబ్బంది డా., మాధురి, భాగ్య లక్ష్మి, రాజేశ్వరి, కాంత లీల తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment