కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జులై 09 ; కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ బియ్యం అమ్ముతున్నారు అనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో సోమవారం టాస్క్ ఫోర్స్ సి.ఐ. అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు వెంకటేష్, జావిద్ హుస్సేన్ ,సునీతలు తనిఖీలు చేయగా కాగజ్ నగర్ టౌన్ లోని తైబ నగర్ లో ఎస్. కే రాజిక్ అను వ్యక్తి బల్దారం. రాములు ఇల్లు కిరాయికి తీసుకుని అందులో చుట్టు పక్కల గ్రామాల నుండి రేషన్ బియ్యం కొనుగోలు చేయటం,వాటిని ప్యాకింగ్ చేయటం మరియు అట్టి రేషన్ బియ్యం ను మహారాస్ట్రా లోని వీరూర్ కు అక్రమ రవాణా చేయటం చేస్తుండగా ఈ రోజు అక్రమ రవాణా చేయటానికి సిద్ధంగా ఉంచిన 25 క్వింటాల్ల రేషన్ బియ్యం, ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ మరియు ఒక వంద వరకు ఖాలి సంచులు స్వాధీనం చేసుకుని తదనంతరం అట్టి ఇంటి ప్రక్కనే వున్న ఎం.డీ .ఆరీఫ్ దగ్గర సుమారు 8 క్వింటాల్ల రేషన్ బియ్యం మరియు ఒక వంద వరకు ఖాలి సంచులు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం కాగజ్ నగర్ టౌన్ పి.ఎస్. పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.
No comments:
Post a Comment