Wednesday, 4 July 2018

రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు తధ్యం ; మాజీ ఎం ఎల్ ఏ ఆత్రం సక్కు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన జులై 04 ; కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, దేశంలో మరియు రాష్ట్రంలో రానున్న లోక్ సభ , అసెంబ్లీ  ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు తధ్యం అని    ఆసిఫాబాద్   మాజీ ఎం ఎల్ ఏ  ఆత్రం సక్కు అన్నారు.  బుధవారం రెబ్బెన మండలం వంకులం గ్రామంలో పలువురు నాయకులూ, యువకులు   కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ  నిర్వహించారు. అనంతరం  ఏర్పాటు చేసిన   కార్యక్రమంలో అయన మాట్లాడారు. కాంగ్రెస్ కు 125 సంవత్సరాల అనుభవం ఉందని, భారత స్వాతంత్ర్య సమరంలో ముఖ్య పాత్ర వహించి స్వాతంత్య్రం సాధించిందన్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత   దేశాన్ని  ప్రగతి పథంలో నడిపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం ఎంతో  అభివృద్ధి చెందిందని, తెలంగాణా రాష్ట్రం రావడానికి కాంగ్రెస్  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కారణమని అన్నారు. రాబోయే 2019 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తధ్యమని అంన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి పార్టీ   లోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో తెరాస పాలనలో అవినీతి రాజ్యమేలుతున్నదని,రాష్ట్రంలో కుటుంబ  పాలన నడుస్తున్నదని అన్నారు. ఆరునెలల క్రితం రాష్ట్రంలోని అవినీతిపై బహిరంగ చర్చకు సవాలు చేశామని ఇప్పటి వరకు స్పందన లేదని అన్నారు.తెరాస ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. దళితులకు 3 ఎకరాలభూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, లక్ష ఉద్యోగాలు మరచిపోయి రోజుకో కోట స్కీం లతో ప్రజలను పక్క దోవ పట్టిస్తున్న కెసిఆర్ కు ప్రజలు రాబోయే ఎన్నికలలో బుడ్డి చెపుతారని అన్నారు. పెద్ద సంఖ్యలో  యువత కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో పార్టీ లో చేరినందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు.   ఈ కార్యక్రమంలోఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాద్, వంకులం ఉపసర్పంచ్ జూపాక మనీషా, మాజీ సర్పంచ్ ప్రేమదాస, గంగాపూర్ సర్పంచ్ ముంజం రవీందర్, నంబాల ఎంపీటీసీ కొవ్వూరి శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment