Tuesday, 3 July 2018

డీలర్ల సమస్యలు పరిష్కరించలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి వినతి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బన ;:  జులై 03 ; రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని  కోరుతు భారతీయ జనతాపార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం గోలేటికి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం అహిర్ కి రెబ్బెన మండల రేషన్ డీలర్లు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతు గత నాలుగు సంవత్సరాలుగా డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ తెరాస ప్రభుత్వాము పట్టించుకోవడం లేదన్నారు.రేషన్ డీలర్లను  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతన సదుపాయం కల్పించి  డీలర్ల న్యాయమైన  సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. చాలి చాలని కమిషన్లతో కాలాన్ని వెళ్లదీస్తున్నామని ఇప్పడికైనా తమకు న్యాయం జరగాలని వారు మంత్రిని కోరారు.ఈ కార్యక్రమంలో  డీలర్ల సంగం మండలాధ్యక్షుడు ఎస్ రామయ్య.శ్రీపతి,ప్రభాకర్, బాపు,జె సంతోష్,ఎల్ గోపాల్,కె శెంకర్, జి జానకి రామ్,జి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment