కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 05 ; భూ ప్రక్షానలనో జరిగిన అవకతవకలను వెంటనే సవరించి కౌలు రైతులు కూడా రుణం అందేలా చూడాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు ఎల్ ప్రేమ్ కుమార్ గురువారం రెబ్బన తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం ఇచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ జన సమితి పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా సాగుచేస్తున్న గిరిజన రైతులకు భూ పట్టాలు అందించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని నిరుపేదలకు డబుల్ బెడ్రూములు వెంటనే కట్టించి ఇవ్వాలన్నారు.ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుందన్నారు.నిరుపేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నారు ఇప్పడివరకు ఒక్క ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు.సొంత రాష్టం లో నిరాయుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు.వేసిన నోటిఫికెషన్స్ అన్ని కోర్టులకు ఎక్కుతాయి అన్నారు.తెరాస ప్రభుత్వం ఇప్పడికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేష్, వయోజన నాయకులు ఇందూరి మోహన్, పోగుల భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి ముంజం వినోద్, గోలేటి గ్రామ అద్యక్షులు ఎస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment