కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 26 ; తెలంగాణ సివిల్ సప్లైయిస్ హమాలి వర్కర్స్ యూనియన్ కొమురం భీమ్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా రెబ్బన మండలిలోని గోలేటికి చెందిన బోగే ఉపేందర్ ఎన్నుకొన్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు తెలిపారు.ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 తేదీన హమాలి జిల్లా 2వ మహాసభలు అసిఫాబాద్ లోని మార్కెట్ యార్డులో జరిగాయని అందులో ఎన్నుకొన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకొన్నందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు కు,ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కి కృతజ్ఞతలు తెలిపారు.హమాలీల హక్కుల కోసం పోరాడుతానని, కార్మికులకు ఎల్లెవెళ్ల అందుబాటులో ఉంటానని అన్నారు.
No comments:
Post a Comment