కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ; :మండల కేంద్రంలోని ఎంపిఎస్ పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను బత్తుల సదానందం మరియు లావుడ్యా రవి లను మంగళవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సహోపాధ్యాయులు విద్యార్థులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారి గురించి మాట్లాడుతు ఉపాధ్యాయ వృత్తిలో మండల కేంద్రంలోని విద్యార్థులకు ఎనలేని సేవలందించారు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా స్థానిక సర్పంచ్ పెసరి వెంకటమ్మ,వార్డ్ మెంబెర్ మోడెమ్ చిరంజీవి గౌడ్,విశిష్ట అతిధిగా మండల విద్యాధికారి ఎం వెంకటేశ్వరస్వామి,ఎస్ఎంసి చైర్మన్ నగేష్,విశాలక్ష్మి,స్థానిక ఉపాద్యాయులు సైదం వెంకటేష్,దొడ్డిపట్ల రవికుమార్ ,కల్వల శంకర్,అనిల్,సోమశేకర్,రేగళ్ల రాము,మందాడే శ్రీనివాస్,శ్యామ్,ఖాదర్,స్థానిక సీఆర్పిలు మిట్ట దేవేందర్, రాజేష్, సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment