Monday, 23 July 2018

గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 23 : గ్రామ పంచాయతీ కార్మికుల  హక్కుల సాధనలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం  రెబ్బన మండలంలోతహశీల్దార్ కార్యాలయం  ఎదుట  నిరవధిక సమ్మెను ప్రారంభించారు.  ఈ సందర్భంగా  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టిఆర్ఎస్ కొమురంభీం  జిల్లా కార్యదర్శి ఎన్. సుధాకర్ లు  మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. గత 40 సవంత్సరాలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు చాలిచాలని వేతనాలు తీసుకుంటూ, గ్రామ అభివృద్ధి లో, ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోసిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం శ్రమదోపిడికి పాల్పడుతున్నాదని , కార్మిక చట్టాలను అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని అన్నారు. కనీస వేతనం 18000 ఇవ్వాలని అన్నారు. కరొబార్లను పంచాయితీ కార్యదర్సులుగా   నియమించాలని,వారికి ఈ ఎస్ ఐ, పి  ఎఫ్   సౌకర్యం కల్పించాలని, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల నర్సయ్య, సునీల్, దేవాజి, వీరయ్య, తిరుపతి, పోచాం ,శంకర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment