కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 15 ; రెబ్బెన గ్రామానికి చెందిన కొండగర్ల చెందు కు ఆదివారం ఎం ఎల్ ఏ కోవలక్ష్మి ముఖ్య మంత్రి సహాయనిధి కింద 60 వేల రూపాయల చెక్కు అందచేశారు. చందుకు రోడ్ ఆక్సిడెంట్ లో కాలుకు ఫ్రాక్చర్ అవడంతో వైద్య ఖర్చుల నిమిత్తం చెక్కు అందచేసినట్లు ఎం ఎల్ ఏ చెప్పారు. తెలంగాణా ప్రభుత్వం పేద ,బడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ తదితర నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment