Saturday, 28 July 2018

గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 28 ; గత వారం రోజులనుండి రెబ్బెన గ్రామంలో మంచినీరు విడుదల చేయడంలేదని, గత్యంతరంలేక శనివారం  రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీఓ  కార్యాలయం ముందు  రెబ్బెన  గ్రామ ప్రజలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిని సుమారు గంటసేపు  దిగ్బంధనం చేశారు. అధికారులకు పలు మార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో రోడెక్కాల్సి వచ్చిందని  గ్రామస్తులు తెలిపారు. ఈ ఓ పి  ఆర్ డి కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకొని  గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కారణంగా  గత వారం రోజులనుండి గ్రామంలో మంచినీరు విడుదలలో ఇబ్బందులు ఉన్నాయని త్వరలో నీటిని విడుదలచేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఈ నిరసనలో నాగమ్మ, శంకరమ్మ, శారద ,వెంకటమ్మ, రాజేశ్వరి, భూదేవి, సరితా, దేవమ్మ, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment