కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 09 ; సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలం విఫలమైందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు. సోమవారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి ఓసీపి గనుల వద్ద జరిగిన గేట్ సమావేశంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో టీబీజీకేఎస్ గుర్తింపు పొందిన కార్మిక సంఘం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గత కొన్ని నెలలుగా వందల మంది కార్మికులు రిటైర్ అవుతున్న వారికీ రావలసిన బెనిఫిట్స్ అందచేయడంలో యాజమాన్యం,గుర్తింపు సంఘం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కార్మికులకు ఉత్పత్తి లాభాల్లో 30% బోనస్ వెంటనే చెల్లించాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి కార్మికుడికి 10 లక్షల రూపాయల వడ్డీలేని ఇంటి రుణాన్ని అందజేస్తామన్నారు ఇంటి రుణాలను వెంటనే అమలు చేయాలన్నారు.కారుణ్య నియామకాలు 100 % చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఇంచార్జి చిప్ప నర్సయ్య, బ్రాంచ్ సెక్రటరీ తిరుపతి,ఆర్గనైజింగ్ సెక్రటరీ శేషు జెగ్గయ్య,రాజేష్,శ్రీను,సంపత్,మల్లేష్,సత్యనారాయణ ,దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment