కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 03 ; : కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికై ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు పరుస్తుందని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి వసుధ మిశ్ర మరియు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.మంగళవారం రెబ్బెన మండలంలోని గంగాపూర్,వంకులం గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రామ స్వరాజ్ అభియాన్ యోజన సదస్సులో వారు మాట్లాడుతు ప్రతి మారుమూల గ్రమాలను అభివృద్ధి చేసేందుకై కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి గ్రామాల అభివృద్ధికి పూనుకుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా ఉజ్వల పథకం ద్వారా పేద మధ్యతరగతి ఎస్సి,ఎస్టీ ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఇంటికి కరెంట్ సౌకర్యం కల్పించాలనే భావనతో ఉచితంగా కరెంటు లేని ఇంటికి కరెంటు మీటర్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు.జన్ధన్ యోజన,సురక్ష భీమా ద్వారా బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి జీవిత భీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 149 గ్రామాల్లో ప్రజలందరికి అవగాహన సదస్సును నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు.అనంతరం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణి వారు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామయ్య,డిఎల్పివో గంగాధర్ గౌడ్,సర్పంచులు రవీందర్,కమల బాయ్,డి ఎం అండ్ హెచ్ ఓ సుబ్బారాయుడు,ఎంపిడివో సత్యనారాయణసింగ్,రామకృష్ణ,వెంకటరమణ శర్మ,కార్యదార్శి శ్వేత,వంశీకృష్ణ,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment