Tuesday, 25 October 2016

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వట్టివేనా

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వట్టివేనా

కొమురం బీమ్  (వుదయం ప్రతినిధి): రెబ్బెన; తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వట్టివేనా అని బి.జె .పి అసెంబ్లీ కన్వీనర్ జె .బి . పౌడెల్ ,జిల్లా ఉపాదాక్షుడు కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు.  బి. జె .పి మండల అధ్యక్షుడు కుందారపు బాలకృష్ణ అద్వర్యంలో మంగళ వారం రెబ్బెన అతిధి గృహం లో బి.జె .పి మండల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి రైతుల రుణ మాఫీలు ఒకేసారి చెల్లించకుండా రైతుల జీవితాలతో చెలగాలాడు రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు అని అన్నారు . దళితులకు మూడు ఎకరాల భూమి మరియు అర్హులు ఐన వారికీ రెండు పడకల ఇండ్లు ఇస్తా అన్న హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్నారు అన్నారు .  అలాగే బి.జె.పి పార్టీ బలోపేతం కోసం మండల నాయకులూ అందరు కృషి చేసి రాబోయే ఎన్నికలలో బి.జె.పి ని అధికారంలోకి రావడం కోసం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాకాంట్రాక్టు సెల్ అధ్యక్షుడు గుల్బమ్ చక్రపాణి ,గోలేటి ఎం.పి .టి .సి మద్దెర్ల సురేందర్ రాజ్ ,రెబ్బెన పట్టణ  అధ్యక్షుడు మండల మధుకర్ ,మండల్ ప్రధాన కార్యదర్శి మాల్రాజు రాంబాబు ,మాజీ మండల అధ్యక్షుడు రాచకొండ రాజు బి. జె .వై .ఎం  మండల అధ్యక్షుడు  బత్తిని రాము , పట్టణ  కార్యదర్శి పసునూటి మల్లేష్ తదితర నాయకులూ ఉన్నారు . 

No comments:

Post a Comment