Wednesday, 12 October 2016

ఘనంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం



ఘనంగా  సర్కిల్ ఇన్స్పెక్టర్  కార్యాలయ ప్రారంభోత్సవం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని విజయ దశమి పర్వదినాన ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్ ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పరిపాలన సౌలభ్యం కోసం రెబ్బెన లో నూతనంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందేలా కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన సి ఐ  మదన్ లాల్ , వైస్ చైర్ మెన్ కుందారపు శంకరమ్మ, జెడ్ పి టి సి సభ్యులు అజ్మిరా బాబురావు, ఎం పి పి సంజీవ్ కుమార్ మరియు  అధికారులు , నాయకులు పాల్గొన్నారు

No comments:

Post a Comment