విద్యార్థులకు మెరుగైన విద్య ,వైద్య సదుపాయాలు కల్పించాలి

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): అఖిల భారత విద్యార్ధి సమాఖ్య సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గ, మండల, పట్టణ నూతన కమిటీని ఎస్సీ వసతి గృహం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్ అద్వర్యం లో ఎన్నుకోవడం జరిగింది.అనంతరం రవీందర్ మట్లడుతూ రాష్ట్రము లో దేశంలో విద్యారంగంలో అనేకసమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప ఆచరణలో చూపించడం లేదన్నారు . విద్యారంగానికి ఇచ్చిన హామీలు KG TO PG కళాశాలల్లో మధ్యాహ్న భోజనం డిగ్రీ కళాశాలలకు పాలిటెక్నిక్ కళాశాలలకు ఏర్పాటు చేస్తామని చెప్పిన కెసిఆర్ ఎప్పటి వరకు హామీలు అమలు చేయలేదన్నారు . విద్యారంగ సమస్యలపై నూతనంగా ఏర్పడిన నియోజకవర్గ సమితి ఆందోళనల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిస్కారం అయ్యేంత వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కమిటీ అధ్యక్షులుగా ఇరిగిరాళ్ల శ్రీకాంత్ ,కార్యదర్శి గ నిక్కోదే తిరుపతి,కాగజ్నగర్ మండల అధ్యక్షుని గ కోట రవివర్మ,ఉపాధ్యక్షులు గ స్వామీ,రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శిగా పి . సంపత్, జాయింట్ కార్యదర్శులుగా సాయి, మల్లేష్, పట్టణఅధ్యక్షులుగ షారుఖ్,పి.శేఖర్ లను ఎన్నుకోవడం జరిగింది అన్నారు.
No comments:
Post a Comment