Tuesday, 18 October 2016

ఏ ఐ టి యూ సి డోర్లి-1 ఫిట్ కార్యదర్శి గ జి నరసింహ్మ రావు

ఏ ఐ టి యూ సి డోర్లి-1 ఫిట్ కార్యదర్శి గ జి నరసింహ్మ రావు 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  గోలేటి కే ఎల్ మహేంద్ర భవన్  ఏ ఐ టి యూ సి ఆఫీస్ లో జరిగిన  డోర్లి-1 ఓపెన్ కాస్ట్ జనరల్ బాడీ సమావేశం లో డోర్లి-1 ఓపె కాస్ట్ ఫిట్ సెక్రటరీ గ జి.నరసింహ్మ రావు, బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గ డి.నర్సింగరావు  ను ఎన్నుకోవడం జరిగిందని ఏ ఐ టి యూ సి గోలేటి బ్రాంచ్ కార్యదర్శి  ఎస్.తిరుపతి తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధి గ విచ్చేసి ఆయన మాట్లాడుతు డోర్లి-1 ఓపె కాస్ట్ లో కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కృషిచేయాలని సింగరేణిలోనే ఉత్పత్తి లో మొదటి స్థానం లో ఉన్న డోర్లి-1 ఓపె కాస్ట్ లోని కార్మికులకు ప్రోత్సహకాలు అందించాలని కాంటీన్ ను విశ్రాంతి గదులలో వసతులని మెరుగు పరచాలని హెచ్ ఈ ఎం ఎం మిషనరిల మెయిన్టెనెన్సు ను పూర్తి స్థాయి లో నిర్వహించాలని జనరల్ షిఫ్ట్ కార్మికులకు క్వారీ కాన్వేయన్సు  ను మెరుగు  పరచాలని ఆయన డిమాండ్ చేసారు ఏ ఐ టి యూ సి కార్మికుల సమస్యల కోసం మరియు సంక్షేమానికి నిరంతరం పోరాడుతుందని  కార్మికుల జండా ఎర్రజండా అని దానిని కార్మిక వర్గం ఆదరించాలని ఆయన కోరారు.ఈ సమావేశం లో బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎం. రామారావు బి.జగ్గయ్య ఓసీపీ ల ఇంచార్జి ఎం.లక్ష్మీనారాయణ  సిపిఐ మండల కార్యదర్శి పొన్న.శంకర్ నాయకులు పి .ఆర్.ప్రకాష్ ఖుద్దూస్ డి.శ్రీనివాస్ కోట.బాపు చంద్రయ్య శ్రీనివాస్ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment