Wednesday, 19 October 2016

కొమురవెల్లి గ్రామా సమస్యలు పరిష్కరించాలి

కొమురవెల్లి  గ్రామా సమస్యలు పరిష్కరించాలి 

కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  కొమురవెల్లి గ్రామా సమస్యలు తీర్చాలని రెబ్బేన ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ మరియు ఎం పి పి సంజీవకుమార్ కి బుధవారం కొమురవెల్లి యూత్ కమిటీ వారు వినతి పత్రం అందచేశారు అనంతరం యూత్ కమిటి అధ్యక్షులు వాడ్నలా  దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో చేతి పంపులు  చెడిపోయి తాగునీటి సమస్య ఉందని అలాగే మురికి కాలువలు శుభ్రం చేయక చెత్త చెదారం  నిండి పోయి వర్షం కురిసినప్పుడు వర్షం నీరు వెళ్ళడానికి దారిలేక మురికి నీరు రోడ్ పై మురికినీరు ఏరులై పారుతుందని అలానే రోడ్ గుంతలలో నీరు నిలిచి రవాణాకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు గ్రామా సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోలెం సాయికృష్ణ ,సభ్యులు పెద్దింటి శ్రీకాంత్ ,మానిగొండ కిరణ్ ,నరేష్ గౌడ్ ,సత్యనారాయణ   సందీప్ శ్రీనివాస్ గౌడ్ రాజుగౌడ్ టి ఆర్ ఎస్ నాయకులూ గోడిశెల వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment