రెబ్బెన లో ఘనంగా దేవి నవ రాత్రులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో దేవి నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . ఇందిరా నగర్ లో ప్రతిష్టాపించిన దుర్గా దేవి గురు వారం లలిత దేవి రూపం లో భక్తులకు దర్శనం ఇచ్చింది . భక్తులు భక్తి శ్రద్దలతో లలితా దేవిని దూప , దీప నైవేద్యాలతో పూజించారు. కుంకుమ పూజలు చేశారు . అదే విధంగా ఖైరి గూడా ఓపెన్ కాస్ట్ గనిలో దుర్గా దేవి వద్ద కుంకుమ ప్రత్యక పూజలు జెనెరల్ మేనేజర్ కె రవి శంకర్ నిర్వహించారు. అనంతరం అన్నదానం వఛ్చిన భక్తులందరికీ చేశారు.
No comments:
Post a Comment