పులజీబాబా భక్తులు యంఎల్ఎ కు ఘన సన్మానం
కొమురం బీమ్ రెబ్బెన; (వుదయం ప్రతినిధి):రెబ్బెన మండలం లోని పుంజమేరా గ్రామ పులజీబాబా భక్తులు గురువారం నాడు జిల్లా ఏర్పాటుకు కారణమైన యంఎల్ఎ కోవ లక్ష్మి ని ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామస్థులు నూతనం గా ఏర్పడిన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లో వెనుకంజలో వున్న తమ గ్రామంను సందర్శించి , గ్రామం లో పులజీబాబా ఆలయ అభివృద్ధి కార్యకలాపాలను జరపవలసిందిగా వారు కోరారు. అనంతరం యంఎల్ఎ కోవ లక్ష్మి మాట్లాడుతూ గ్రామమును త్వరలోనే సందర్శించి ఏర్పడ్డ సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులూ నవీన్, వెంకన్న, గ్రామస్థులు గుర్లె పుంజుమేర, గుర్లె సోమయ్య, వాడై హన్మంతు, గుర్లె శ్రీనివాస్, వాడై నాను బాయి, వాడై సావిత్ర బాయి, నీకొదే చిన్నుబాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment